News January 28, 2025

కీసర గుట్ట జాతర తేదీల ప్రకటన

image

ప్రసిద్ధి చెందిన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం జాతర తేదీలను ఛైర్మన్ తటాకం నారాయణ శర్మ, EO సుధాకర్ రెడ్డి ప్రకటించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 24న విఘ్నేశ్వర పూజ, 25న స్వామివారి కళ్యాణం, 26న మహా శివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 27న విమాన రథోత్సవం, 28న వసంతోత్సవం, పుష్పయాగం, మార్చి 1న పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు తెలుపుతూ కరపత్రాలు విడుదల చేశారు. SHARE IT

Similar News

News September 16, 2025

నేడు HYDకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

image

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. SEP 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు హాజరవుతారు. పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

News September 15, 2025

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

image

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.

News September 15, 2025

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

image

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.