News February 22, 2025
కీసర గుట్ట జాతర.. TOLL FREE నంబర్లు..!

కీసరగుట్ట జాతర ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కీసరగుట్ట మహాశివరాత్రి జాతర సంబంధించిన సమాచారం, జాతరలో ఎవరైనా తప్పిపోయినా వెంటనే తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఇతర ఫిర్యాదులకు 040-29320699, 040-29350699కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News November 13, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

సంగారెడ్డిలోని జిల్లా కేంద్రంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంజయ్య గురువారం తెలిపారు. 14న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విలువైన సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
News November 13, 2025
భార్యను హతమార్చిన భర్త

అనంతపురం జిల్లా బెలుగుప్పలో గురువారం దారుణ ఘటన జరిగింది. భార్యను భర్త హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో నరికి చంపాడు. హత్య తర్వాత నిందితుడు బెలుగుప్ప పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 65 సమాధానాలు

ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
శంతనుడు, గంగాదేవి ఎనిమిదవ కుమారుడు ‘దేవవత్రుడు’. హస్తినాపురానికి రాజుగా కాబోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు ఆయనకు ‘భీష్ముడు’ అనే పేరు వచ్చింది. శంతనుడి సంతోషం కోసం, తన తండ్రి పెళ్లి చేసుకొనే సత్యవతి పుత్రులకు రాజ్యాధికారం దక్కాలని భీష్ముడు ఈ ప్రతిజ్ఞ చేశాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


