News January 10, 2026

కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహన రద్దీ

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు రావడంతో పట్టణ వాసులు పల్లె బాట పట్టారు. దీంతో జాతీయ రహదారులపై వాహనాలు కిక్కిరిసాయి. టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు క్యూలలో నిలబడ్డారు. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. స్వర్ణ టోల్ ప్లాజా వద్ద 7 ఫాస్ట్ ట్రాక్ లైన్లు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా వాహనాలు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

Similar News

News February 12, 2026

ASF: మున్సిపల్ ‘కౌన్సిలర్ల’ క్యాంపు రాజకీయం!

image

ASF మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, BRS మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో హ్యాంగ్ ఫలితాల భయంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఛైర్మన్ అభ్యర్థి రాపర్తి రవి, చిలువేరు వెంకన్న మినహా మిగిలిన 18 మంది అభ్యర్థులను బెంగళూరు క్యాంపునకు తరలించినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతోనే ర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

News February 12, 2026

ఇలాంటి నాయకుడు కావాలి సర్!

image

ఆప్ ఎంపీ, యువ నేత <<19108486>>రాఘవ్ సింగ్ చద్ధా<<>> పార్లమెంటులో లేవనెత్తుతున్న సమస్యలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆహార కల్తీ, ధరలు, ప్రజా సంక్షేమం, పన్నుల మోత.. ఇలా సామాన్యుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈయన వల్లే 10 నిమిషాల డెలివరీ, గిగ్ వర్కర్ల సమస్యలు దేశానికి తెలిశాయి. కార్పొరేట్ ట్యాక్స్ కంటే వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను ఎక్కువగా ఉందని వేతన జీవుల కష్టాన్ని తెలియజేశారు.

News February 12, 2026

ఒమన్‌పై లంక ఘన విజయం

image

T20WCలో ఒమన్‌పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత శ్రీలంక 225/5 స్కోర్ చేసింది. కుశాల్ మెండిస్(61), పవన్(60), దసున్ శనక(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. 226 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన ఒమన్ 120/9 స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్-Bలో లంక(4 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన విషయం తెలిసిందే.