News May 14, 2024

కుంటాల: జర్మనీ నుంచి వచ్చి ఓటు వేసిన యువకుడు

image

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నానాజీ పటేల్ -గంగాసాగర దంపతుల కుమారుడు సిందె ఆకాష్ ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లాడు. పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి సోమవారం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగం చేయకూడదు అన్న ఉద్దేశంతోనే తాను వచ్చి ఓటు వేశానని తెలిపారు.

Similar News

News September 12, 2025

ADB: ‘జాతీయ సమావేశాలు జయప్రదం చేయండి’

image

దివ్యాంగులకు విద్య, ఉపాధి, సంక్షేమం, సాధికారత అంశాలపై ఎన్పీఆర్డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా 2025 అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ జాతీయ సదస్సు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఈసమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు.

News September 12, 2025

ఆదిలాబాద్ : ఐటీఐల్లో వాక్ ఇన్ అడ్మిషన్లు

image

ఐటీఐ, ఏటీసీలో చేరేందుకు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆగస్టు 30 వరకు అడ్మిషన్ గడువు ఉండగా సెప్టెంబర్ 30వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటికే 1వ, 2వ, 3వ దశలలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ వాక్-ఇన్ అడ్మిషన్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT.

News September 12, 2025

ఆదిలాబాద్: ‘బాల్య వివాహాలు చేయడం నేరం’

image

బాల్య వివాహాలను అంతం చేయడానికి పూర్తి ఒకరూ కృషి చేయాలని మౌలానా అబ్దుల్ అజీమ్ అసది, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యుడు సమీరుల్లా అన్నారు. ఆదిలాబాద్‌లోని మహమ్మదీయ మస్జిద్ శుక్రవారం నమాజ్ అనంతరం ష్యూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వరల్డ్ ప్రచారం కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్ధాలను వివరించారు. బాల్య వివాహాలు చేయడం నేరమన్నారు. జిల్లా కోఆర్డినేటర్ వినోద్ ఉన్నారు.