News December 20, 2025

కుంటాల: 4 ఉద్యోగాలు సాధించిన వినయ్

image

కుంటాలకు చెందిన వినయ్ బాబు వరుస ఉద్యోగాలు సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో విజయం సాధించారు. వినయ్ గతంలోనే FBO, జూనియర్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీగా ఎంపికై తన ప్రతిభను చాటుకున్నారు. గ్రూప్-3 సాధించాలనే పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన విజయం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ వినయ్‌ను ఘనంగా అభినందించారు.

Similar News

News December 29, 2025

హనుమకొండ: ఒకే గ్రామం.. ఐదు చోట్ల పాలన!

image

జిల్లాలోని వెంకటేశ్వరపల్లి గ్రామస్థుల పరిస్థితి అత్యంత విచిత్రంగా మారింది. గ్రామం పేరు ఒకచోట ఉంటే, మండలం నడికూడ, రెవెన్యూ విభాగం నార్లాపూర్‌, తహశీల్దార్ కార్యాలయం కమలాపూర్‌, పోలీస్ స్టేషన్ పరకాలలో ఉన్నాయి. బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం ఒక మండలంలో దరఖాస్తు చేసి, మరో మండలంలో తీసుకోవాల్సి వస్తోంది. ఏ పత్రాల్లోనూ తమ ఊరి పేరు స్పష్టంగా ఉండటం లేదని, పాలనను క్రమబద్ధీకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News December 29, 2025

పాలమూరు: భవనం పైనుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

image

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని భావన(17).. రెండో అంతస్తు నుంచి కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతికి కంటి చూపు సమస్య ఉందని స్థానికులు తెలిపారు. ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై సద్దాం పేర్కొన్నారు.

News December 29, 2025

సినిమా డైరెక్టర్‌గా పిట్లం యువకుడు

image

పిట్లంకు చెందిన యువకుడు తుకారాం సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి సినీ రంగంలో రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కాగితం పడవలు’ విడుదలకు సిద్ధమవుతోంది. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 27న ఘనంగా విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని Way2Newsతో చెప్పారు.