News February 7, 2025

కుంభమేళాకు అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులు

image

మహా కుంభమేళ యాత్రకు వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. 8 రోజులు పాటు జరిగే యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ధ గయ, అరసవిల్లి, శ్రీకూర్మం త్రివేణి సంగమం క్షేత్రాలు వెళ్లవచ్చని తెలిపారు.

Similar News

News February 23, 2026

IPL-2026లో ధోనీ ఆడతారా?

image

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. IPLకు CSK మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. IPL-2026 సీజన్‌లో మహీ ఆడతారని ఆ జట్టు CEO కాశీ విశ్వనాథన్ తెలిపారు. 2 సీజన్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి జట్టుకు మెంటార్‌గా ఉంటారని వార్తలు రాగా ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చినట్లైంది. 44 ఏళ్ల ధోనీ CSKకు 5 ట్రోఫీలు అందించారు. ప్రస్తుతం ఆ జట్టుకు రుతురాజ్ సారథిగా ఉన్నారు.

News February 23, 2026

కల్తీ నెయ్యి అంశంపై అసెంబ్లీలో చర్చ?

image

AP: రాష్ట్రంలో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఓ రోజు ఈ అంశంపై చర్చ జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే అసెంబ్లీ తర్వాత మండలిలోనూ చర్చ పెట్టాలని భావిస్తోందట. ఈ అంశంపై అధికారికంగా తన వైఖరిని వెల్లడించడంతో పాటు అవసరమైన చర్యలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

News February 23, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ పాల్వంచ: మనస్థాపనతో మహిళ ఆత్మహత్య
✓ దమ్మపేట: రూ.130 లక్షల నగదు, బంగారం లూటీ
✓ భద్రాచలం: గోదావరి వద్ద వైభవంగా నదీ హారతి
✓ పాల్వంచ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు
✓ రేపు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓ భద్రాద్రిలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండండి: డీఎఫ్‌వో
✓ ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లందు ఎమ్మెల్యే