News January 31, 2025
కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్‌ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్‌ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.
Similar News
News February 26, 2025
నర్సంపేట: తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతి

తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్దుపురంలో చోటుచేసుకుంది. చింతకాయల రాజశేఖర్ ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్ తండ్రి మల్లయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మల్లయ్య సంవత్సరికం రోజే రాజశేఖర్ పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందగా, స్థానికులు నివాళులర్పించారు.
News February 26, 2025
వరంగల్: రైతన్నలు సిద్ధంగా ఉన్నారు: మాజీ MLA

రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మిర్చి పంట ధరలు పడిపోయి రైతన్నలు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఎనుమముల మార్కెట్‌ను సందర్శించి రైతన్నల కష్టాలను అడిగి తెలుసుకున్నామన్నారు.
News February 26, 2025
వరంగల్: లేఅవుట్ అనుమతుల కోసం కమిటీ సమావేశం

వరంగల్ జిల్లాలో లేఅవుట్ అనుమతుల కోసం కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన లేఅవుట్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. వరంగల్ జిల్లా, జీడబ్ల్యూఎంసీ, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు లేఅవుట్ల కోసం ప్రతిపాదనలు కాగా వాటిని కమిటీ నిబంధనలను అనుసరించి పరిశీలించి చర్చించి అనుమతి మంజూరు చేసింది. కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీపీ సీపీ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.