News February 21, 2025

కుంభాభిషేక కార్యక్రమానికి కేసీఆర్‌కు ఆహ్వానం

image

యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ పూజారులు శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 23న మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

Similar News

News September 16, 2025

వరంగల్ ప్రజలకు మరింత చేరువగా..!

image

వరంగల్ పోలీసులు ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. Instagram, X, Facebookలో తమ అధికారిక ఖాతాలను నిర్వహిస్తూ, నేరాల నివారణ, భద్రత, అవగాహనపై సమాచారం అందిస్తున్నారు. ఈ వేదికల ద్వారా ప్రజలు పోలీసులకు తమ సమస్యలను తెలియజేసి, అప్‌డేట్‌లను పొందవచ్చు. ఇది ప్రజల భద్రతకు, పోలీస్-ప్రజల సంబంధాలకు దోహదపడుతుంది.

News September 16, 2025

టీయూ ఎం.ఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్/అక్టోబర్‌-2025లో నిర్వహించనున్న ఎం.ఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సెప్టెంబర్ 20లోపు ఫీజులు చెల్లించవచ్చని, రూ.100 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సందర్శించాలని సూచించారు.

News September 16, 2025

ములుగు: ప్రజా పాలన వేడుకల షెడ్యూల్ ఇదే..!

image

జిల్లాలో బుధవారం జరిగే ప్రజా పాలన వేడుకల షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు.
* ఉదయం9.45 ఎస్పీ శబరీష్, కలెక్టర్ దివాకర్ టీఎస్ కలెక్టరేట్‌కు చేరుకుంటారు.
*9.55 గంటలకు వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క వేదిక వద్దకు చేరుకుంటారు.
*10.00 గంటలకు మంత్రి జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన, పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, అనంతరం మంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.