News April 7, 2025

కుక్క కాటుకు బలైన బాలుడి కుటుంబానికి ఆర్థికసాయం 

image

గుంటూరులోని స్వర్ణభారతినగర్‌లో కుక్కల దాడిలో చనిపోయిన 4ఏళ్ల ఐజాక్ విషాద ఘటనపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు బాలుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

Similar News

News April 8, 2025

అమరావతిలో మోదీ పర్యటనకు ఏర్పాట్లు

image

అమరావతి రాజధాని ప్రాంతంలో నరేంద్ర మోదీ ఈనెలలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించడానికి పర్యటించనున్నారు. నేపథ్యంలో వెలగపూడి లోని సచివాలయం వెనుక ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఐఏఎస్ వీర పాండ్యన్ జిల్లా, ఎస్పీ సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

News April 7, 2025

మంగళగిరి: వేసవి వచ్చే సరికి మట్టి కుండలకు మార్కెట్ జోష్  

image

మంగళగిరిలో మట్టి పాత్రల తయారీ మళ్లీ ఊపందుకుంది. 300కి పైగా కుటుంబాలు ఈ సంప్రదాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయి. వేసవిలో పెరిగిన డిమాండ్‌తో రోజుకు 15 కుండల వరకు తయారు చేస్తూ జీవనా ధారం చేసుకుంటున్నారు. ఎర్రమట్టి కొరత సమస్యగా మారినప్పటికీ కుటుంబాలంతా పట్టుదలతో వృత్తిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇక్కడి మట్టి కుండలు ఎగుమతవుతుండటం విశేషం. ఒక్కొక్క కుండ ధర సుమారు రూ.100 వరకు పలుకుతుంది.

News April 7, 2025

తాడేపల్లి: ఆర్థిక వివాదం.. యువకుడి హత్య  

image

తాడేపల్లిలో ఓ యువకుడు హత్య కలకలం రేపింది. ఆదివారం జరిగిన హత్యపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక వివాదంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది హత్యకు దారితీసిందన్నారు. భరత్ అనే యువకుడు వర్ధన్ అనే యువకుడిని కత్తితో పొడవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధన్ మృతిచెందాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!