News March 8, 2025
కుటుంబంలో సమాజంలో మహిళ పాత్ర విశిష్టం: కలెక్టర్

కుటుంబంలో, సమాజంలో మహిళ పాత్ర విశిష్టం అని కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కర్నూలులోని కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పండుగలా జరుపుకోవడం సాధించడమే మహిళలు సాధించిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. జాయింట్ కలెక్టర్ నవ్య పాల్గొన్నారు.
Similar News
News March 9, 2025
బీటీ నాయుడుకు మరో ఛాన్స్

బీటీ నాయుడు జాక్‌పాట్ కొట్టారు. ఆయనకు <<15705007>>టీడీపీ <<>>మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమలదిన్నెకు చెందిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ నెల 29తో పదవీ కాలం ముగియనుండగా తాజాగా సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రేపు నామినేషన్ వేయనున్నారు. బీటీ నాయుడు 1994 నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
News March 9, 2025
అర్ధరాత్రి కర్నూలుకు పోసాని

పోసాని కృష్ణమురళిని విజయవాడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తరలించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిన్న పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి విజయవాడకు తరలించిన విషయం తెలిసిందే. పోసానిని రెండో రోజు విచారణ చేయనుండగా.. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. రేపు ఆయన బెయిల్ పిటిషన్‌పై కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది.
News March 9, 2025
ఆదోని అథ్లెట్ కాజా బిందె నవాజ్‌కు గోల్డ్ మెడల్

45వ మాస్టర్స్ అథ్లెటిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కాజా బిందె నవాజ్ 60+ పురుషుల విభాగంలో 300 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకుని ఆదోనికి గర్వించదగ్గ విజయం సాధించారు. ఏళ్ల శ్రమ, అంకితభావం, పట్టుదల ఫలితంగా ఈ గొప్ప ఘనత అందుకున్నారు. ఈ విషయం తెలిసి ఆదోని క్రీడాకారులు, అభిమానులు ఆయన మెచ్చుకున్నారు.