News February 6, 2025
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన గంగవరపు శీను(35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య జ్యోతి, అత్తమామలే కారణమని లేఖ రాసి, నా ఇద్దరూ చిన్న పిల్లలు జాగ్రత్త అంటూ చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News November 6, 2025
ఒంగోలు: 10 నుంచి అసెస్మెంట్ పరీక్షలు

ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 గంటల నుంచి 12.35గంటల వరకు.. 6, 7వ తరగతి విద్యార్థులకు 1.15 గంటల నుంచి 4.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
News November 6, 2025
మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్‌గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
News November 6, 2025
ఒంగోలులో తొలిసారి షూటింగ్ టోర్నమెంట్.!

ప్రకాశం జిల్లాకు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి షూటింగ్ టోర్నమెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈనెల 7, 8, 9న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 700మంది క్రీడాకారులు తరలి వస్తారని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. టోర్నీ గురించి కలెక్టర్ రాజాబాబుతో డీఈఓ బుధవారం చర్చించారు.


