News December 24, 2025
కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ ఫొటో

క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఫొటోను ఆయన అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫొటోలో విజయమ్మ, దివ్యారెడ్డి, భారతి రెడ్డి తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు.
Similar News
News December 28, 2025
2025లో కడప జిల్లాలో సంచలన ఘటనలు ఇవే.!

▶ విషాదం నింపిన మే నెల.. మే 23న మైలవరం మండలంలో 3ఏళ్ల చిన్నారిపై హత్యాచారం. నిందితుడి ఆత్మహత్య
▶ మే 13న బ్రహ్మంగారిమఠం (M) మల్లెపల్లెలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
▶ మే 24న గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపుతప్పి కారుపై పడటంతో ఐదుగురు మృతి
▶ జులైలో గండికోటలో బాలిక హత్య.. ఇంకా కొలిక్కి రాని కేసు
▶ అక్టోబర్ 5న ప్రొద్దుటూరులో తల్లిని చంపిన కొడుకు
▶ అక్టోబర్ 26న జమ్మలమడుగులో జంట హత్యలు.
News December 28, 2025
2025లో కడప జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవే.!

☛ ఉద్రిక్తతల నడుమ గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నికలో YCP విజయం
☛ పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో TDP విజయం
☛ కూటమి నేతలకు పదవులు
☛ కడప మేయర్‌గా సురేశ్ బాబు తొలగింపు.. తర్వాతి ఎన్నికలో పాక సురేశ్ ఎన్నిక
☛ కడప జిల్లా TDP అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియామకం
☛ కడప జిల్లాలో మహానాడు నిర్వహణ
☛ జమ్మలమడుగు YCP ఇన్‌ఛార్జ్‌గా రామసుబ్బారెడ్డి నియామకం
☛ ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిలపై దీక్షలు.
News December 27, 2025
ప్రొద్దుటూరు: నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,400
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,248
* వెండి 10 గ్రాములు ధర రూ.2,530


