News March 19, 2026
కుదిరితే ఏప్రిల్ 6నే ఇంటర్ రిజల్ట్స్!

TG: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. వీలైతే ఏప్రిల్ 6న లేదంటే ఏప్రిల్ 10లోపు ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. జూన్ 1న కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మే 31 నాటికే సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీనికోసం ఈ నెల 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ టైమ్‌ను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. గతేడాది ఏప్రిల్ 22న ఫలితాలు వచ్చాయి.
Similar News
News April 15, 2026
ఏప్రిల్ 15: చరిత్రలో ఈ రోజు

*1452: బహుముఖ ప్రజ్ఞాశాలి లియొనార్డో డావిన్సి జయంతి(ఫొటోలో)
*1469: భారత ఆధ్యాత్మిక గురువు గురునానక్ జయంతి
*1865: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం
*1912: టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజు
*1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం
*ప్రపంచ కళా దినోత్సవం
*సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం
News April 15, 2026
పవన్‌తో తోట చంద్రశేఖర్ భేటీ.. మళ్లీ జనసేనలోకి?

AP: జనసేన అధినేత, DyCM పవన్ కళ్యాణ్‌ను తోట చంద్రశేఖర్ కలిశారు. మంగళగరిలోని జనసేన ఆఫీసులో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ల కిందట BRS పార్టీలో చేరారు. AP BRS అధ్యక్షుడిగా పని చేశారు. కానీ చాలా రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవన్‌ను కలవడంతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.