News October 11, 2025
కుప్పంలో పరిశ్రమకు ప్రధాని మోదీ శంకుస్థాపన

కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తి సంస్థ ఇంటిగ్రేటెడ్ డైరీ, పశువుల దానా ప్లాంట్ ఏర్పాటుకు శనివారం PM నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గుడిపల్లి(M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సుమారు 45 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు సంబంధించి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు సమక్షంలో పరిశ్రమ యాజమాన్యం MOU చేసుకున్నారు.
Similar News
News October 11, 2025
Colgate పేరుతో నకిలీ టూత్ పేస్టులు

ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా తాజాగా నకిలీ టూత్ పేస్టులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో Colgate పేరుతో రెడీ చేసిన ఫేక్ టూత్ పేస్ట్ బాక్స్‌లు భారీగా బయటపడ్డాయి. చిత్రోడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి వీటిని పట్టుకున్నారు. సుమారు రూ.9.43 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీని సప్లై చైన్ తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
News October 11, 2025
HYD: జిల్లా అధ్యక్షుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు..!

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల భర్తీకి తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్ కమిటీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇవాళ్టి నుంచి డీసీసీ అధ్యక్ష పదవులకు దరఖాస్తులను అధిష్ఠాన పెద్దలు స్వీకరించనున్నారు. వారం రోజులపాటు ఏఐసీసీ పరిశీలకులు పరిశీలించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షులను బలమైన నేతలు పెట్టేందుకు ఏఐసీసీ గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తుంది.