News October 27, 2025

కుప్పంలో పరిశ్రమల శంకుస్థాపన వాయిదా

image

కుప్పంలో <<18107753>>7 పరిశ్రమల ఏర్పాటు<<>>కు మంగళవారం CM చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయదలిచిన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నవంబర్ రెండవ వారంలో సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

Similar News

News October 27, 2025

దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళం

image

హైదరాబాద్ పోలీసులు దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళాన్ని ఏర్పాటు చేశారు. గుర్రపుస్వారీలో శిక్షణపొంది, మెరికల్లా తయారై సిటీమౌంటెడ్‌ పోలీస్‌ విభాగంలో భాగమయ్యారు 9మంది మహిళా కానిస్టేబుళ్లు. వీరంతా 2024 ఆర్డ్మ్‌ రిజర్వ్‌ బ్యాచ్‌కి చెందిన వాళ్లు. వీరికి గుర్రపుస్వారీలో 6నెలల పాటు శిక్షణ ఇప్పించి విధులను అప్పగించారు. మంచి శిక్షణ ఇస్తే తామూ ఎందులోనూ తీసిపోమని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారీ నారీమణులు.

News October 27, 2025

పాగుంట వెంకన్న హుండీ ఆదాయం రూ.11,26,292

image

కేటీదొడ్డి మండలం పాగుంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరి, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.పురేందర్ కుమార్, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో లెక్కింపు జరిగింది. గత 11 నెలలకు గాను హుండీ ఆదాయం మొత్తం రూ.11,26,292 వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.

News October 27, 2025

GWL: పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు- SP

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భూవివాదాలు 4, కుటుంబ తగాదాలు1, గొడవలు 9, ఇతర అంశాలకు సంబంధించి 2, మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచరాదన్నారు.