News January 31, 2026

కుప్పంలో ప్రయోగం… రాష్ట్రమంతా అమలు: CM

image

AP: కుప్పం నియోజకవర్గం ఓ ప్రయోగశాల అని, ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేసి రాష్ట్రమంతా అమలు చేస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘లక్షమందిని పారిశ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్ ద్వారా దీన్ని అమలు చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్‌తో APని అగ్రస్థానంలో నిలబెడతాం. కుప్పం దానికి మొదటి మెట్టు. ఇక్కడ ₹7088 CRతో 16 పరిశ్రమలు వచ్చాయి’ అని వివరించారు.

Similar News

News February 15, 2026

ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

image

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జననం
1861: UK గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం
2022: మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లాహిరి మరణం (ఫొటోలో)

News February 15, 2026

చిరంజీవి సినిమాలో ‘ఛాంపియన్’ హీరోయిన్?

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో <<18950253>>మరో సినిమా<<>> తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో చిరు కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. కీలకమైన కూతురు క్యారెక్టర్ కోసం ‘ఛాంపియన్’ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కృతి శెట్టి, సారా అర్జున్ పేర్లనూ పరిశీలించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

News February 15, 2026

విష ప్రయోగం వల్లే రష్యా ప్రతిపక్ష నేత మృతి: యూరప్ దేశాలు

image

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలులో <<12701983>>అనుమానాస్పద రీతి<<>>లో చనిపోవడం తెలిసిందే. విష ప్రయోగం వల్లే ఆయన మృతిచెందినట్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ తాజాగా ఆరోపించాయి. నావల్నీ నుంచి సేకరించి నమూనాల్లో epibatidine అనే విషం ఆనవాళ్లు ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. దక్షిణ అమెరికాలోని ప్రమాదకర కప్పల్లో ఈ విషం ఉంటుందని చెప్పాయి.