News August 30, 2025
కుప్పంలో సీఎం.. నేటి షెడ్యూల్ ఇలా!

సీఎం చంద్రబాబు కుప్పంలో నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు శాంతిపురం(M) శివపురంలోని తన ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో పరమసముద్రంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంటారు. బస్సులోనే మహిళలతో మాట్లాడుతారు. 11:30 గంటలకు జలహారతి ఇస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులతో ఎంవోయూలు చేసుకుంటారు.
Similar News
News August 30, 2025
చిత్తూరు: లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు

జిల్లా కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో డీఆర్ఓ మోహన్ కుమార్, DC విజయ శేఖర్ బాబు ఆధ్వర్యంలో శనివారం లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరిగింది. 11 బార్లు, గీత కార్మికులను ఒక బారుకు గాను 4 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిని చిత్తూరు నగరపాలక పరిధిలో 3, పుంగనూరు మున్సిపాలిటీలో 1, కుప్పం మున్సిపాలిటీలో 1 ఎంపికైన వారికి కేటాయించినట్లు తెలిపారు.
News August 30, 2025
CTR: నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. లబ్ధిదారులు స్వస్థలాలకు వచ్చి డీలర్, వీఆర్వోల సమక్షంలో కార్డులు పొందాలని సూచించారు. బయోమెట్రిక్ వేసిన అనంతరం కార్డులు అందజేస్తామన్నారు. జిల్లాకు 5.26 లక్షల స్మార్ట్ కార్డులు వచ్చినట్టు వెల్లడించారు.
News August 30, 2025
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి మిథున్ రెడ్డి బెయిల్ వస్తుందో? లేదో? చూడాలి మరి.