News October 26, 2025
కుప్పంలో 28న 7 పరిశ్రమలకు శంకుస్థాపన

కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల ఏర్పాటుకు ఈ నెల 28న సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం ప్రాంత పారిశ్రామిక వికాసం దిశగా, ప్రగతి పథంలో ముందడుగులో భాగంగా రూ.2,203 కోట్ల పెట్టుబడితో దాదాపు 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి. అలీఫ్, మదర్ డైరీ, ACE, శ్రీజ, ఆదిత్య బిర్లా గ్రూప్, SVF, ROYCE పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News October 26, 2025
దిలావర్‌పూర్‌లో అత్యధికం

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 250.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా దిలావర్‌పూర్ మండలంలో 62.2 మి.మీ., సారంగాపూర్‌లో 51.2 మి.మీ. వర్షం కురిసింది. రాబోయే 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 26, 2025
కొమురం భీమ్ గురించి తెలుసుకోండి: మోదీ

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏళ్ల యువకుడు ఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురించి యువత తెలుసుకోవాలి’ అని మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చారు.
News October 26, 2025
KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్!

IPL: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి BCCI తొలగించాక అభిషేక్ KKR సపోర్ట్ స్టాఫ్‌గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన హెడ్ కోచ్‌గా ప్రమోట్ అవుతున్నారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపింది. WPLలో UP వారియర్స్‌కు నాయర్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.


