News March 2, 2025

కుప్పం టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎత్తివేత

image

కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ పెట్టిన ఆంక్షలు ఎత్తివేసినట్లు పీఐసీ ఛైర్మన్ బ్రహ్మానందరెడ్డి, బ్యాంకు మేనేజర్ శివకృష్ణ పేర్కొన్నారు. ఇకపై బ్యాంకులో మోర్టగేజ్, గోల్డ్, హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మార్చి తర్వాత షేర్ హోల్డర్లకు చెల్లించాల్సిన డిపెండెంట్లు సైతం చెల్లిస్తామని, బ్యాంకు పరిధిలో పేరుకుపోయిన సుమారు రూ.3 కోట్ల బకాయిలను రికవరీ చేసినట్లు వారు తెలిపారు.

Similar News

News March 3, 2025

కుప్పం : చికెన్ పట్ల అపోహలు వద్దు : ఎమ్మెల్సీ

image

చికెన్ పట్ల సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం సాయంత్రం చికెన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు దొరుకుతుందని, అపోహలను పక్కనపెట్టి చికెన్ తినొచ్చని అన్నారు.

News March 3, 2025

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

image

శాంతిపురం (M) మఠం వద్ద శనివారం బైకుపై లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో <<15621064>>మృతుల సంఖ్య మూడుకు<<>> చేరింది. బైరెడ్డిపల్లె (M) మూగనపల్లికి చెందిన తల్లి కొడుకు తులసమ్మ, రవితేజ అక్కడికక్కడే మృతి చెందగా మరో కొడుకు పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో మూగనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 2, 2025

చిత్తూరు జిల్లాలో 96% పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికారులు 96 శాతం పంపిణీ చేశారు. 2,64,899 మంది లబ్ధిదారులకుగాను 2,54,375 మందికి (96.03) పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీడి నెల్లూరులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. 

error: Content is protected !!