News September 19, 2025
కుప్పం : భార్యపై హత్యాయత్నం చేసిన భర్త అరెస్ట్

కుప్పం (M) బైరప్ప కొట్టాలుకు చెందిన కీర్తిపై కత్తితో దాడి చేసిన భర్త రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు DSP పార్థసారథి, సీఐ శంకరయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం తల్లి అనుమతి లేకుండా మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్న రాజేశ్ డెలివరీ కోసం భార్యను పుట్టింటికి పంపించాడు. డెలివరీ అయి 4 నెలలు కావస్తుండగా కాపురానికి రావాలంటూ ఒత్తిడి చేయగా ఆమె రాకపోవడంతో ఈ నెల 17న కత్తితో దాడి చేశాడు.
Similar News
News September 19, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపాల మండలం చలి చీమల పల్లి వద్ద జరిగే నేషనల్ హైవే పనులను పరిశీలించారు. చెరువు వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.
News September 19, 2025
చిత్తూరు: టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కలేనా..?

చిత్తూరు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్‌గా పేరు గడించింది. రోజుకు 1,500 టన్నుల పంటకు ఇక్కడ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇంత ఉన్నా రైతులు మాత్రం నష్టాలతో పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాలకులు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం మాత్రం దాల్చ లేదు. ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
News September 18, 2025
కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.