News February 5, 2025
కుప్పం: రహదారుల అభివృద్ధికి రూ.53.35 కోట్లు మంజూరు

కుప్పం నియోజకవర్గంలో ఆర్ అండ్ బి ద్వారా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గంలో 23 రహదారుల అభివృద్ధి కోసం ఆర్‌ఐడిఎఫ్ గ్రాంట్ కింద రూ.53.35 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని 23 రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
Similar News
News February 27, 2026
చిత్తూరు: రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్..!

ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పణకు మిగిలిందిక 2 రోజులే. ఈనెల 28 చివరి రోజు కావడంతో ఆన్లైన్ విధానంలో జీవన్ ప్రమాణ్ యాప్‌లో లైవ్ సర్టిఫికెట్ నమోదు చేయవచ్చు. చిత్తూరు జిల్లాలో పెన్షన్‌దారులు 12,500 ఉండగా గురువారం వరకు 11780 మంది లైవ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేశారు. మరో 720 మంది సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంది.
News February 27, 2026
చిత్తూరు: 129 సెంటర్లలో పది పరీక్షలు

ప్రశాంత వాతవరణంలో పది పరీక్షలు నిర్వహణకు సిద్ధం కావాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
News February 26, 2026
‘సంజీవని’ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్

సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు. ఈ సేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకునేలా చూడాలని సూచించారు.


