News January 30, 2026

కుప్పం: విద్యార్థుల మధ్య కూర్చున్న CM

image

CM చంద్రబాబు అగస్త్య ఫౌండేషన్‌లో విద్యార్థుల మధ్యలో కూర్చొని అగస్త్య 25 ఏళ్ల ప్రస్తావాన్ని వీడియో రూపంలో తిలకించారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించడంలో నవీనత, విజ్ఞానం, సాంకేతిక ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు. అకాడమీ ప్రతినిధులు విద్యార్థులకు తమ సైన్స్ & టెక్నాలజీ ఆవిష్కరణ కార్యక్రమంపై వినూత్నంగా రూపొందించిన వీడియోను ఆయన తిలకించారు.

Similar News

News February 14, 2026

చిత్తూరు: ఈ ఏడాది నీటి ఎద్దడి లేనట్లే.!

image

కృష్ణా జలాలతో ఈ ఏడాది జిల్లాలో నీటి ఎద్దడి తప్పింది. పుంగనూరు తంబళ్లపల్లె, మదనపల్లె, నియోజకవర్గాలలోని అన్ని చెవులకు, పలమనేరులో కొన్ని చెరువులకు హంద్రి-నీవా ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. తంబళ్లపల్లెలో రెండు, మదనపల్లెలో 4 చెవులకు నీటిని మళ్లించారు. పుంగనూరులో 2, పలమనేరులో కొంత మేర చెరువులకు PBC నుంచి నీటిని తరలిస్తారు. ఎక్కడన్నా నీటి సమస్య వస్తే ఎదుర్కొనుందేకు సిద్ధమని అధికారులు తెలిపారు.

News February 14, 2026

చిత్తూరు: నీరున్నా వృథాగా వాడితే ఇబ్బందులే.!

image

హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు చేరాయి. నీరు ఉంది కదా అని వృథాగా వాడితే భవిష్యతులో ఇబ్బందులు తప్పవని పలువురు వాపోతున్నారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాళ్ల ద్వారా జిల్లాకు సరాసరి 4.5TMCల నీరు వస్తోంది. మార్చి ఆఖరు వరకు ఈ నీటి విడుదల కొనసాగనుంది. వర్షాలు, హంద్రీ-నీవా జలాలతో 80% చెరువులు నిండు కుండలా మారాయి. కుప్పంలో 92 చెరువులు పూర్తిగా, 14 పాక్షికంగా, పలమనేరులో మరో 54 చెరువులు నిండాయి.

News February 14, 2026

చిత్తూరు జిల్లా నేతలతో లోకేశ్ సమావేశం

image

చిత్తూరు జిల్లాకు సంబంధించిన MP, MLA లు, MLCలతో మంత్రి లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అదే విధంగా జిల్లా రాజకీయాలపై మంత్రి చర్చించినట్లు సమాచారం.