News January 28, 2026

కుప్పకూలిన విమానం.. కారణమిదే

image

మహారాష్ట్ర బారామతి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లి కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఫ్లైట్‌పై పైలట్ పూర్తిగా పట్టుకోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రమాదానికి గురైన Learjet 45 ఎయిర్‌క్రాఫ్ట్‌ను VSR సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఈ దుర్ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు <<18980385>>మరణించారు.<<>>

Similar News

News February 20, 2026

డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి కొత్త నిబంధనలు!

image

TG: డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(DL), లైబ్రేరియన్, PD పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఎంపిక ప్రక్రియను 3 విభాగాలు చేసింది. ఇకపై అకడమిక్ మెరిట్‌కు గరిష్ఠంగా 50%, రాత పరీక్షకు 40%, ఇంటర్వ్యూకు 10% మార్కులు కేటాయించింది. గతంలో రాతపరీక్షకే 100% మార్కులుండేవి. ఈ పోస్టులను TGPSC ద్వారానే భర్తీ చేయనుంది. 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

News February 20, 2026

ఫోన్ పే, GPayలో లంచాలు.. 8 మంది ఆఫీసర్లపై వేటు!

image

TG: వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్న విద్యుత్ అధికారులపై TGSPDCL సీఎండీ ముషారఫ్ చర్యలు తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్, కొత్త కనెక్షన్లు, రెగ్యులర్ సర్వీసులకూ డబ్బు వసూలు చేసిన 8 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో ఒక ADE, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో 150కి పైగా ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపారు. ఆ 8 మంది ఫోన్ పే, GPay ద్వారా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు.

News February 20, 2026

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లు!

image

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లను అలవరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘నిద్ర లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా గడపండి. 10 నిమిషాలు ఎండలో ఉండండి. తిన్నాక 10 నిమిషాలు నడవండి. వారంలో 3 సార్లయినా పెరుగు, యోగర్ట్, కెఫీర్ తీసుకోండి. మందు, సిగరెట్లు వద్దు. పసుపు, జీలకర్ర, సోంపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోండి. 12 గం. భోజన సమయాన్ని ఫాలోకండి.. మిగతా 12 గం. ఏమీ తినొద్దు. 7-8 గంటలు నిద్రపోండి’ అని చెబుతున్నారు.