News August 28, 2025

కుప్పానికి సీఎం.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు 29వ తేదీ సాయంత్రం 6:30 గం.తుమ్మిసి హెలిపాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి శివపురంలోని సొంతింటికి చేరుకుంటారు. రాత్రి 7:30 గం.కు కడ అడ్వైజరి కమిటీతో సమావేశం, రాత్రి సొంతింట్లో బస చేస్తారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ బస్సులో పరమసముద్రంకు వస్తూ వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో చర్చించనున్నారు. 11:30 గంటలకు హంద్రీనీవాకు జల హారతి, 11:55 గం.కు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.

Similar News

News August 28, 2025

బోయకొండ బోర్డుకు 115 దరఖాస్తులు

image

బోయకొండ గంగమ్మ ఆలయంలో నూతన పాలకమండలి(బోర్డు) కోసం 115 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఈవో ఏకాంబరం వెల్లడించారు. దరఖాస్తుల గడువు ఈనెల 27న ముగియడంతో చివరి దరఖాస్తును చిన్న ఓబునం పల్లికి చెందిన సుధాకర్ భార్య రాధమ్మ అందజేశారు. సెప్టెంబర్ 1న పరిశీలించి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనకు అభ్యర్థులు కచ్చితంగా రావాలన్నారు.

News August 28, 2025

చిత్తూరు: మహిళా దొంగలు అరెస్ట్

image

బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఆ జిల్లా ఎస్పీ జగదీశ్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్.సుమతి, ఎస్.గీత, ఎస్.రంజిత్, ఎస్.బృంద‌ను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుంచి రూ.23 లక్షలు విలువైన 242.5 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News August 27, 2025

పుంగనూరులో యాక్సిడెంట్..మహిళ మృతి

image

పుంగనూరులో బుధవారం జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో ఓ మహిళ మృతి చెందింది. సింగరిగుంట గ్రామానికి చెందిన భార్య,భర్తలు బోయకొండ, సుజాత పుంగనూరు నుంచి సింగరిగుంటకు బైక్‌పై వెళ్తున్నారు. రెడ్డివారి బావి వద్ద వాహనంపై నుంచి సుజాత జారి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రురాలను తిరుపతి రుయా ఆసుపత్రికి ఓ అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోని రొంపిచర్ల వద్ద మృతి చెందింది.