News September 8, 2025
కుబీర్: ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగి గ్రామానికి చెందిన గంగాధర్ (33) భైంసా నుంటి ఆటోలో సిమెంటు బస్తాలను తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓల్డ్ సాంవ్లీ గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News September 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 9, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
✒ ఇష: రాత్రి 7.36 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 9, 2025
కరాటే పోటీల్లో రాయికల్ విద్యార్థులకు ‘GOLD’

కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని రాయికల్ ఎస్సై సుధీర్ రావు అన్నారు. కరీంనగర్లో జరిగిన 3వ రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ కుంగ్ ఫూ అండ్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో రాయికల్‌కు చెందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరికి ఎస్సై పతకాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కరాటే మాస్టర్ ప్రభాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
News September 9, 2025
SRCL: ప్రజావాణికి 154 దరఖాస్తులు

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇవాళ జరిగిన ప్రజావాణిలో 154 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 49, అత్యల్పంగా SC కార్పొరేషన్, ADSLR, జిల్లా వ్యవసాయ శాఖ, ఏడీ మైన్స్, వేములవాడ మున్సిపల్, DEO, ఇరిగేషన్, EEPR, DIEO, LDM, మార్కెటింగ్ శాఖకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.