News March 18, 2025

కుబీర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్ (48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికిరాలేదని తన కుమారుడు చేన్లోకి వెళ్లి చూడగా కరెంట్ షాక్‌కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

Similar News

News September 15, 2025

రాబోయే రెండు గంటల్లో వర్షం

image

ఏపీలోని ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. TGలోని సంగారెడ్డి, వికారాబాద్, HYD, RR, కామారెడ్డి, MDK, SDPT, SRPT, NLG, KMM, కొత్తగూడెం, భువనగిరి, HNK, SRCL, జగిత్యాల, KNR, ADLB, NZMBలో సాయంత్రం తర్వాత పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

News September 15, 2025

ADB: సైబర్ వల.. చిక్కితే విలవిల!

image

సైబర్ మోసగాళ్లు రోజుకో మార్గం ఎంచుకొని అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆఫర్లు, బెట్టింగ్స్, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే డబ్బులిస్తామని, హనీట్రాప్ ఇలా విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నారు. వీరి వలలో చిక్కుకున్న బాధితులు విలవిల్లాడుతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. గత వారంలో ADB జిల్లాలో 20+ కేసులు నమోదయ్యాయి. ఎవరైనా మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండి.
SHARE IT

News September 15, 2025

రాజమండ్రి: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులతో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.