News March 18, 2025
కుబీర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్(48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికి రాలేదని తన కుమారుడు వెళ్లి చూడగా కరెంట్ షాక్‌కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
Similar News
News March 18, 2025
ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఈడీ ఫోకస్ చేసింది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల సంపాదనపై ఆరా తీసింది. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్, హవాలా రూపంలో వారికి చెల్లింపులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే <<15801067>>11 మంది<<>> ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారణకు పిలిచారు.
News March 18, 2025
కృష్ణా: లబ్ధిదారుల పురోభివృద్ధికి తోడ్పడండి: కలెక్టర్

లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు వారి పంట మీద తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు.
News March 18, 2025
సీఎంకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బలహీనవర్గాల హక్కుల కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎంని ప్రశంసించారు.