News April 12, 2025
కుబీర్: పరువు పోయిందని గోదావరిలో దూకాడు

లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన పాండురంగ్ వ్యక్తి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. పాండురంగ్ అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఎద్దులు నమ్మారు. విషయం తెలుసుకున్న అన్నదమ్ములు, భార్య నిలదీయడంతో తిరిగి ఎద్దులను తెచ్చాడు. నా పరువు పోయిందంటూ బ్యాంకు వెళ్తానని చెప్పి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News November 7, 2025
జనగామ: వారంలో కూతురి పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

జనగామ(D) బచ్చన్నపేట(M) ఆలీంపూర్‌లో <<18216896>>నిన్న రోడ్డు ప్రమాదంలో<<>> ఒకరు మరణించిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక(M) వెలికట్టెకు చెందిన ఓయువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈక్రమంలో చేర్యాల(M)ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్, DCMఎదురెదురుగా ఢీకొనగా శ్రీనివాస్ మరణించాడు.
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.
News November 7, 2025
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు.!

రాజధాని నిర్మాణానికి రూ. 7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రుణం మంజూరుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అమరావతిలో CM చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు అందజేశారు. కార్యక్రమంలో NABFID డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.


