News October 7, 2025

కుబీర్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్‌కు చెందిన ముచ్చిండ్ల గణేష్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటీన భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించగా చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 7, 2025

జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ?

image

TG: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఓకే చెబితే నందమూరి హరికృష్ణ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నేడు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఉండవల్లి నివాసంలో భేటీ కానున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేయనున్నారు.

News October 7, 2025

పీలేరులో పతాకస్థాయికి MLA పీఏ భూకబ్జాలు: YCP

image

పీలేరు <<17935208>>MLA కిషోర్ కుమార్ పీఏ<<>> సత్య తన భూమిని కబ్జా చేశారని అనురాధ అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరవర్గం భారీగా కబ్జాలు చేస్తోంది. పీలేరులో ఎమ్మెల్యే పీఏ భూకబ్జాలు పతాకస్థాయికి చేరాయి. ఈ 15 నెలల్లో ఇసుక, లిక్కర్‌లో దోచుకుంది మీ వాళ్లకి సరిపోలేదా చంద్రబాబు?’ అంటూ YCP ట్వీట్ చేసింది.

News October 7, 2025

పాయకరావుపేట: తీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థి మృతదేహం

image

పాయకరావుపేట మండలం పాల్మాన్‌పేట సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం గల్లంతయిన పాలిటెక్నిక్ విద్యార్థి అశోక్ (19) మృతదేహం లభ్యమయింది. మంగళవారం ఉదయం అదే మండలం కొర్లయ్యపేట సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. స్థానిక మత్స్యకారులు సమాచారాన్ని మెరైన్ పోలీసులకు అందజేశారు. సముద్ర స్థానం చేసి బయటకు వస్తుండగా పెద్ద కెరటం వచ్చి అశోక్‌ను లోపలికి లాక్కుపోవడంతో గల్లంతయిన విషయం తెలిసిందే.