News February 24, 2025
కుబీర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. భైంసా మండలం మిర్జాపూర్ సమీపంలో ఈ నెల 16న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కుబీర్‌కు చెందిన సిందే సంతోష్ తలకు తీవ్రంగా గాయమైంది. కాగా నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంతోష్ ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 24, 2025
ఆపరేషన్ SLBC: రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

TG: SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దించింది. నిన్న ఢిల్లీ నుంచి HYDకు చేరుకున్న ఆరుగురు మైనర్లు కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41మంది కార్మికులు చిక్కుకోగా 17రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా తీసుకొచ్చారు.
News February 24, 2025
బాలానగర్: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

ఉరేసుకుని నర్సింగ్ <<15558470>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్‌నగర్‌లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News February 24, 2025
నంబూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్‌హెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం.. నంబూరు గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. తమ సిబ్బందితో కలిసి ఆ స్థావరంపై దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకొని రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.