News September 6, 2025

కుమారుడికి ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

image

కుమారుడికి టీచర్ ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తిలి మండలం బల్లిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కుమారుడికి DSCలో ఉద్యోగం రాకపోవడంతో గ్రామానికి చెందిన కాకర్ల ఆదినారాయణ (65) శుక్రవారం రాత్రి తణుకులోని ఓ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News September 6, 2025

ఈ-పంట నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జేసీ

image

ఈ-పంట నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉండి మండలం యండగండిలో ఈ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు మండలంలో 10,500 ఎకరాలకు గాను 9,000 ఎకరాల నమోదు పూర్తయిందని అధికారులు ఆయనకు తెలిపారు. యండగండి గ్రామంలో 1,300 ఎకరాలకు గాను 1,050 ఎకరాలు నమోదైనట్లు పేర్కొన్నారు.

News September 5, 2025

తణుకు: ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ లభ్యం

image

తణుకులోని ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ లభ్యమైనట్లు తణుకు పోలీసులు తెలిపారు. అత్తిలి మండలం బల్లిపాడులో ఇందిరమ్మ కాలనీకు చెందిన కాకర్ల ఆదినారాయణ(65) గా గుర్తించారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆదినారాయణ ఇంటికి వెళ్లకపోగా తణుకులో సూర్యాలయం వీధిలో శుక్రవారం రాత్రి హాస్య ఆసుపత్రి భవనం పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

News September 5, 2025

పాలకొల్లు: మహిళ కడుపులో భారీ గడ్డ

image

పోడూరులోని వద్దిపర్రుకు చెందిన కడియం సీతా మహాలక్ష్మి కడుపు నొప్పి, ఉబ్బరంతో గురువారం రాత్రి పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికివచ్చారు. వైద్యులు స్కాన్ చేసి కడుపులో గడ్డ ఉందని తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణతిని బైటకు తీసి ఆమెను కాపాడారు. జనరల్, లాప్రోస్కోపిక్ సర్జన్ డా.లంకలపల్లి గోకుల్ కుమార్, డా. లక్ష్మి వైద్యులను అభినందించారు.