News April 25, 2025
కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. లేబర్ కాలనీకి చెందిన రవి, లక్ష్మీజ్యోతి (39) దంపతుల కుమారుడు భరత్ పదో తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. మనస్తాపం చెందిన తల్లి క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 29, 2025
కర్నూలు ఎస్పీ గ్రీవెన్స్ డేకు 79 ఫిర్యాదులు

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 79 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి తీసుకున్న అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎయిడెడ్ స్కూల్లో టీచర్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన మాధప్ప రూ.14.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని దొరస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
News September 29, 2025
నెలకు రూ.వెయ్యి ఆదా: కర్నూలు కలెక్టర్

కర్నూలు: జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పోస్టర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.వెయ్యి వరకు ఆదా అవుతోందని తెలిపారు.
News September 29, 2025
రాయలసీమ: ఆర్.యు పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

రాయలసీమ యూనివర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ ఫలితాలను ఆదివారం ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట్రావు బసవరావు విడుదల చేశారు. పీ. జీ రెండవ సెమిస్టర్ లో 462 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థులు ఫలితాలను రాయలసీమ యూనివర్సిటీ వెబ్సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని తెలిపారు.