News February 28, 2026
కుమ్మెర బాధితులతో కలిసి OUలో నిరసన

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీసులు బాధితులకు అండగా నిలవడంలో విఫలమయ్యారని విమర్శించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Similar News
News March 1, 2026
రణస్థలం: మామకు తలకొరివి పెట్టిన కోడలు

రణస్థలం కాపువీధికి చెందిన కె.రామప్పడు అనే విశ్రాంత ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన కోడలు ఉమా మామ మృతదేహానికి తలకొరివి పెట్టింది. రామప్పడు భార్య చిన్నమ్మడు, కుమారులు అప్పన్న, రాంబాబు కొన్నాళ్ల క్రితం మృతిచెందగా అనారోగ్యానికి గురైన మామకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
News March 1, 2026
నెల్లూరు జిల్లా YCPలో ఆయన ఫేవరెట్టా.?

ఎన్నికల్లో ఓటమితో జిల్లాలో డీలాపడ్డ YCPకి MLC చంద్రశేఖర్ రెడ్డి అండగా ఉన్నారు. అనిల్, కాకాణి వంటి నేతలు పార్టీకి కొంత కాలం దూరంగా ఉండటం, ఆ సమయంలో కూటమికి దీటుగా సమాధానం ఇవ్వడం, కార్యకర్తలు, నేతలకు భరోసా ఇవ్వడంతో చంద్రశేఖర్ రెడ్డి జగన్ దృష్టిని ఆకర్షించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నుంచి ఆయన్ను బరిలో దింపనున్నట్లు చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండటం ఆయనకు కలిసొస్తుందంటున్నారు.
News March 1, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL)లో 34 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 3 ఆఖరుతేదీ కాగా.. మార్చి 14వరకు పొడిగించారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PhD, MBA/PGP/PGDM, LLB, CA/CMA, టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1,000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.celindia.co.in


