News September 1, 2025
కురబలకోట: కొడుకు దొంగిలించిన డబ్బును చెల్లించిన తండ్రి

కురబలకోట మండలంలోని జంగావారిపల్లిలో ఉండే వెంకటరమణ సోమవారం తన కొడుకు దొంగిలించిన డబ్బును చెల్లించాడు. వెంకటేశ్ తెట్టు సచివాలయంలో విద్యుత్ సెక్రటరీగా ఉంటూ రూ.4.64 లక్షల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల డబ్బుతో పరారయ్యాడని అధికారులు తెలపడంతో కొడుకు భవిష్యత్ కోసం అధికారులతో చర్చలు జరిపి, ఎన్నో ప్రయసాలతో రూ.3 లక్షలను అధికారుల సమక్షంలో కురబలకోట ఎంపీడీవోకు చెల్లించాడు.
Similar News
News September 4, 2025
ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు

ఏయూలో ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో రెండు సంవత్సరాల కోర్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సెల్ఫ్ సపోర్టు విధానంలో నిర్వహించే ఈ కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. రక్షణ రంగ ఉద్యోగులకు వార్షిక ఫీజుగా రూ.40 వేలు, ఇతరులకు రూ.60 వేలుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
News September 4, 2025
NTR: రేపు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు సంబంధించి ఎరువుల సరఫరా, ఇతర సమస్యలపై శుక్రవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశా గురువారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు జరుగుతుందన్నారు. రైతులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు తెలియజేయవచ్చని చెప్పారు.
News September 4, 2025
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి: BHPL కలెక్టర్

వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు వెంటనే చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు త్వరగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నష్టపరిహారం పనులు త్వరగా పూర్తి చేయడానికి అంచనాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.