News October 19, 2024
కురబల కోటలో యువకుడు దారుణ హత్య

కురబలకోటలో గుర్తు తెలియని యువకుడు శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. సుమారు 25 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడ్ని కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద డంపింగ్ యార్డ్‌లో ప్రత్యర్థులు పథకం ప్రకారం గొంతు కోసి హత మార్చారు. అటుగా వెళ్తున్న గ్రామస్థులు గుర్తించి ముదివేడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు విచారిస్తున్నారు.
Similar News
News February 24, 2026
చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2026
సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.