News March 31, 2025

కురుపాంలో ఏనుగుల గుంపు సంచారం

image

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా కురుపాం మండలం సీతంపేట, పూతిక వలస ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News February 23, 2026

యూనస్ కుట్రలు చేశారు.. బంగ్లా అధ్యక్షుడి ఆరోపణలు

image

బంగ్లా మాజీ అడ్వైజర్ యూనస్‌పై దేశాధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను రాజ్యాంగ విరుద్ధంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేశారని చెప్పారు. ‘దేశాన్ని అస్థిరపరిచేందుకు యూనస్ ప్రయత్నించారు. దేశ శాంతి భద్రతలను శాశ్వతంగా నాశనం చేయాలని చూశారు’ అని ఓ ఇంటర్వ్యూలో విమర్శించారు. ఏడాదిన్నర కాలంలో తనను ప్యాలెస్ ఖైదీగా మార్చారని, 2 విదేశీ పర్యటనలను అడ్డుకున్నారని వాపోయారు.

News February 23, 2026

పద్మనాభ రెడ్డి గారు.. కాపుల జోలికి రావొద్దు: సానా సతీశ్

image

YCP నేత ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ MP సానా సతీశ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ముద్రగడ అంబటి రాంబాబును పరామర్శించిన నేపథ్యంలో ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభం కాపుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థం కోసం కాపుల ఆత్మగౌరవాన్ని వినియోగించుకోవద్దని సతీశ్ సూచించారు.

News February 23, 2026

‘దిశ’ సమావేశానికి అధికారులు సిద్ధంగా రావాలి: కలెక్టర్

image

ఈ నెల 27న నిర్వహించే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరిపాలన అంశాలపై సమీక్షించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ.10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని అధికారులను సూచించారు.