News October 6, 2025
కురుపాం గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి

కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెంనాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలు, డైనింగ్ హాలు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ఇద్దరు విద్యార్థులు మృతికి మిగతా విద్యార్థులు అనారోగ్యం బారిన పడడానికి గల కారణాలను పాఠశాల సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 6, 2025
మస్క్ సంస్థకు US ఆర్మీ రూ.6K Cr కాంట్రాక్టు

స్పేస్ ఎక్స్ సంస్థ భారీ US మిలిటరీ కాంట్రాక్టు పొందింది. వచ్చే ఆర్థిక సం.లో ఆర్మీ చేపట్టే 7 కీలక రాకెట్ లాంచ్‌లలో 5 మస్క్ సంస్థకు దక్కాయి. నేషనల్ సెక్యూరిటీ స్పేస్ లాంచ్ ప్రోగ్రాం(NSSL) కింద జరిగిన ఈ ఒప్పంద విలువ $714 మిలియన్లు (₹6,339 కోట్లు). ట్రంప్-మస్క్ మధ్య చెడిన మైత్రి మళ్లీ కుదిరాక ఇది జరగడం గమనార్హం. ఇక అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థకు అర్హతలు లేవని కాంట్రాక్ట్ ఇవ్వలేదు.
News October 6, 2025
NLG: అభ్యర్థుల కోసం అన్వేషణ.. పార్టీల వ్యూహాలు

నల్గొండ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజారిటీ సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో 33 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ, 33 ఎంపీపీ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పేర్లను సేకరించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఎన్నికల కోసం ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు.
News October 6, 2025
వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

2025కు సంబంధించి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. రోగనిరోధక శక్తిపై పరిశోధనలకు గాను మేరీ బ్రాంకౌ (అమెరికా), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్‌లు వచ్చాయి.