News January 4, 2026
కురుపాం: చికిత్స పొందుతూ యువకుడు మృతి

కురుపాం(M) పి.లేవిడి గ్రామానికి చెందిన వి.అజిత్ కుమార్ (23) గత నాలుగు రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.స్థానికుల వివరాలు మేరకు..గత నెల 31న గుమ్మలక్ష్మీపురం(M)బొద్దిడి సమీపంలో గ్యాస్ వ్యాన్‌ను బైక్ ఢీకొని ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో అజిత్ కుమార్‌కు తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు.
Similar News
News January 10, 2026
సంగారెడ్డి: శిశు గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా జడ్జి

సంగారెడ్డిలోని శిశు గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సౌజన్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న వసతులు, ఆహారం, ఇతర సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను తమ సొంత బిడ్డల్లా భావించి సంరక్షించాలని సూచించారు. ఎవరికైనా న్యాయ సహాయం కావాల్సి వస్తే ఉచితంగా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో శిశు గృహ సిబ్బంది పాల్గొన్నారు.
News January 10, 2026
12న నెల్లూరు జిల్లాకు మాజీ ఉపరాష్ట్రపతి రాక

నెల్లూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పర్యటన ఖరారైంది. ఈనెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 12న స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు వస్తారు. 17వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.
News January 10, 2026
శంఖం పూలకు పెరుగుతున్న డిమాండ్

ఇప్పటివరకు పెరట్లో పూసే మొక్కగా మాత్రమే చూసిన శంఖం పూలు ఇప్పుడు రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. సహజ రంగులు, హెర్బల్ టీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఈ పూల సాగు భారీగా పెరుగుతోంది. అస్సాం, UP, WB రాష్ట్రాల్లో మహిళా రైతులు ఈ పంటతో మంచి లాభాలు పొందుతున్నారు. టీ, డై తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్న వీటికి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.


