News December 23, 2025
కులపిచ్చి ముందు ఓడిన కన్నప్రేమ

టెక్నాలజీ పరుగులు తీస్తున్నా సమాజాన్ని ఇంకా కులం అనే సంకెళ్లు వీడటం లేదు. కర్ణాటకలో పరువు హత్యే దీనికి నిదర్శనం. దళితుడిని ప్రేమపెళ్లి చేసుకుందని 6 నెలల గర్భిణి అయిన మాన్యను కన్నతండ్రే కర్కశంగా హతమార్చాడు. బంధువులతో కలిసి ఇనుప రాడ్డులతో దాడి చేసి పుట్టబోయే బిడ్డతో సహా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఈ ఘటన కొందరిలో కులపిచ్చి ఎంత బలంగా నాటుకుపోయిందో తెలియజేస్తోంది.
Similar News
News December 23, 2025
549 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ కోటాలో 549 కానిస్టేబుల్(GD) పోస్టుల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసై, క్రీడల్లో రాణిస్తున్న 18-23 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. DEC 27 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. PST, స్పోర్ట్స్ ప్రదర్శన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: rectt.bsf.gov.in/
News December 23, 2025
మహోన్నత శక్తికి ప్రతీక ‘శివుడు’

‘ఓం ప్రవరాయ నమః’ – శివుడు సర్వశ్రేష్టుడు, మహోన్నతుడు. గుణాల్లో, శక్తిలో ఆ ప్రవరుడికి సాటి లేరు. సమస్త దేవతలు, మునులు ఆయన శ్రేష్ఠత్వాన్ని కొలుస్తారు. మనం ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నా, సత్సంస్కారాన్ని పొందాలన్నా ఆయన పేరును స్మరించాలి. విజ్ఞానానికి, సద్గుణాలకు నెలవైన ఆయన అత్యుత్తమ దైవశక్తిగా, ఆదిగురువుగా పూజలందుకుంటారు. అలా కొలవడం వల్ల మనలోని అజ్ఞానమనే మలినాలు తొలగిపోతాయి. <<-se>>#SHIVANAMAM<<>>
News December 23, 2025
కొరటాల శివ- బాలయ్య కాంబోలో సినిమా?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ కాంబినేషన్ సెట్ కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ, నందమూరి బాలకృష్ణతో ఒక ఊర మాస్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. తన సోషల్ మెసేజ్ మార్క్‌ను బాలయ్య పవర్ ఫుల్ ఇమేజ్‌కు జోడించి కొరటాల ఒక పొలిటికల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే బాలయ్య ‘అఖండ-2’ విడుదలవగా, ‘దేవర’తో కొరటాల హిట్ కొట్టిన విషయం తెలిసిందే.


