News July 10, 2025
కుళ్లాయి స్వామి చివరి దర్శనం

గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి చివరి దర్శనంతో ఘనంగా ముగిశాయి. రాత్రి 7 గంటల సమయంలో తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయి స్వామి ప్రధాన పీరుని అలంకరించి చావిడిలో భక్తులకు దర్శనం కల్పించారు. ప్రధాన అర్చకుడు హుసేనప్ప ప్రార్థనలు చేశారు. ‘కుళ్లాయి స్వామి గోవిందా..’ నామ్మస్మరణతో గూగూడు మార్మోగింది. అనంతరం స్వామి పీర్లను పెట్టెలో పెట్టి మకానంలో భద్రపరిచారు.
Similar News
News July 10, 2025
త్వరలో ఆదర్శ రైతుల ద్వారా పథకాల అమలు: రైతు కమిషన్

TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.
News July 10, 2025
సంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా మురళీకృష్ణ

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మురళీకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వైద్యులు సహకరించాలని కోరారు.
News July 10, 2025
సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాకు రూ.46,71,612 విడుదల చేశారని, త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.