News September 24, 2025
కూకట్‌పల్లిలో ఇంట్లోకి వెళ్లి దాడి.. అక్రమ సంబంధమే కారణమా !

కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు ఇంట్లోకి చొరబడి భూపాల్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో తన భార్య చంద్రకళ వివాహేతర సంబంధంపై భూపాల్ అనుమానం వ్యక్తం చేశారు. 5ఏళ్ల క్రితం తమ పెళ్లి జరగ్గా, ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో వివహేతర సంబంధం ఉందని, ఆ విషయమై గొడవ జరగడంతో దుర్గయ్య అనే వ్యక్తితో కలిసి ఆమె దాడి చేయించిందని భూపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 24, 2025
వరంగల్: మూడో సారి ఆడపిల్ల పుట్టిందని అమ్మిన తల్లిదండ్రులు!

వరంగల్(D) నెక్కొండ మండలంలోని టేకులకుంట తండాలో పసికందును విక్రయించిన ఘటన కలకలం రేపింది. తండాకు చెందిన మౌనిక-యాకూబ్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల మూడో కాన్పులో జూలైలో మరో ఆడపిల్ల పుట్టింది. అంగన్వాడీ కార్యకర్త వీరమ్మ 3 రోజుల క్రితం యాకూబ్ ఇంటికి వెళ్లగా బిడ్డ కనిపించలేదు. బిడ్డ అచూకీపై తల్లిదండ్రులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. దీంతో పసికందును రూ.50వేలకు అమ్మినట్లు తెలిసింది.
News September 24, 2025
ఎస్సీ, ఎస్టీ కేసులపై హైకోర్టు కీలక తీర్పు

AP: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన FIRలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లేకుంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పిటిషన్‌కు విచారణ అర్హత ఉంటుందని తెలిపింది. ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ముందస్తు బెయిల్‌పై నిషేధం ఉంటుందని పేర్కొంది.
News September 24, 2025
అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ

దేవీ శరన్నవరాత్రులలో మూడో రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆహార, పోషణకు ప్రతీక అయిన ఈ అలంకారంలో అమ్మవారు స్వర్ణపాత్ర, బంగారు త్రిశూలం, అభయహస్తాలతో అలరారుతూ కనులవిందు చేశారు. ఈ రూపంలో దుర్గమ్మను పూజిస్తే అన్నానికి లోటు ఉండదని భక్తుల విశ్వాసం.