News September 12, 2025
కూకట్‌పల్లిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

కూకట్‌పల్లిలోని 15వ ఫేజ్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార కేంద్రాన్ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిర్వాహకురాలితో పాటు నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News September 12, 2025
రాష్ట్రంలో మరోసారి కుల గణన: సిద్దరామయ్య

కర్ణాటకలో మరోసారి కుల గణన చేయాల్సిన అవసరం ఉందని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ‘సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా మరోసారి సర్వే నిర్వహించబోతున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ గణన జరుగుతుంది. 2015లో నిర్వహించిన సర్వే రిపోర్టును ప్రభుత్వం ఆమోదించలేదు. పదేళ్లు గడిచిపోయాయి. తాజాగా మరోసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన సామాజిక న్యాయం దక్కాలి’ అని తెలిపారు.
News September 12, 2025
పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష: VZM SP

తెర్లాం PSలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కంకణాల కిరణ్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. తెర్లాంకు చెందిన బాలిక నడుచుకుంటూ వెళుతుండగా అదే గ్రామానికి చెందిన కిరణ్ ఆమెను అడ్డగించి, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయగా పారిపోయాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు SP తెలిపారు.
News September 12, 2025
ASF: ‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగనున్న ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావ్, పోలీస్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.