News April 1, 2025
కూకట్‌పల్లిలో EPFO శిబిరాల నిర్వహణ

ఈపీఎఫ్‌ఓ రీజినల్ ఆఫీస్ (RO) కూకట్‌పల్లిలో HYD, RR, MDCL జిల్లాల్లో నిధి అప్కే నికట్ 2.0 శిబిరాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ శిబిరాల ద్వారా కార్మికులు, నియోగదారులకు ఉద్యోగి భవిష్యనిధి (EPF) సేవలను సులభంగా అందించడమే లక్ష్యంగా పేర్కొంది. EPF ఖాతాలను అప్‌డేట్ చేయడం, పిన్ సమస్యలను పరిష్కరించడం, వివరాలను సమర్పించడం వంటి సేవలు అందిస్తూ, ప్రజలకు EPFO సేవలు సులభతరం చేసింది.
Similar News
News December 24, 2025
JEE, NEET ఎగ్జామ్స్‌లో ఫేషియల్ రికగ్నిషన్!

JEE, NEET పరీక్షల్లో ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేయాలని NTA భావిస్తోంది. 2026 నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా అడ్డుకునేందుకు దీనికి శ్రీకారం చుడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పరీక్షలకు అప్లై చేసుకునే టైంలో రీసెంట్ ఫొటోగ్రాఫ్‌ల స్కాన్‌తో పాటు లైవ్ ఫొటోలను క్యాప్చర్ చేయడాన్ని తప్పనిసరి చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
News December 24, 2025
‘ఓటర్ జాబితా సవరణ, మ్యాపింగ్ పూర్తి చేయాలి’

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ, డేటా మ్యాపింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఐటీడీఏ పీవో రాహుల్, మండల తహాశీల్దార్లతో ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ, సీతమ్మసాగర్ ప్రాజెక్టు భూసేకరణ పై సమీక్ష జరిపారు.
News December 24, 2025
సిద్దిపేట: ‘రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షలు’

సురక్ష బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పుల్లూరు మేనేజర్ ప్రదీప్ చెప్పారు. జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.436 చెల్లిస్తే జీవిత బీమా రూ.2 లక్షలు వర్తిస్తుందని తెలిపారు. రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని బస్టాండ్‌లో జాగృతి ఫౌండేషన్ విజయవాడ ఉమాశంకర్ కళాజాత బృంద సభ్యులు ఆర్థిక, డిజిటల్ పై అవగాహన కల్పించారు.


