News August 22, 2025
కూకట్‌పల్లి: ఎవరు చంపారో.. ఎందుకు చంపారో!

కూతురి వంటి నిండా కత్తిపోట్లతో చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. 5 రోజులైనా తమ కుమర్తెను ఎందుకు చంపారో, ఎవరు చంపారో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఇంతటి విషాదంలోనూ గురువారం బాలిక తల్లిదండ్రులు కూకట్‌పల్లి పోలీసులకు 8 గంటల పాటు విచారణకు సహకరించారు. హత్యకు ముందు కుటుంబంలో జరిగిన తగాదాలు వంటి విషయాలను వారి నుంచి సేకరించారు. 5 బృందాలు విచారణ చేపడుతున్నా చిన్న క్లూ కూడా దొరకకపోవడం గమనార్హం.
Similar News
News April 14, 2026
భగ్గుమంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. సోమవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో అత్యధికంగా 42.8℃, సారంగాపూర్‌లో 42.6℃ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురం, సిరిసిల్లలో 42.5℃, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి 42.4, గంగాధరలో 42.1, పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లి 41.7, ఆకెనపల్లిలో 41.6℃ ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
News April 14, 2026
మధ్యాహ్నం కాకముందే వరంగల్‌లో భగభగలు!

ఉమ్మడి జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉ. 9:30 నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మహదేవర్‌పూర్, మల్హర్, పలిమెల, టేకుమట్ల మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పనుల నిమిత్తం వెళ్లిన ఓరుగల్లు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ గ్రామంలో ఎండ ఎలా ఉంది?
News April 14, 2026
ZHB: తమ్ముడి పెళ్లి.. ఇంతలో అక్క ఫ్యామిలీ దుర్మరణం

జహీరాబాద్‌కు చెందిన కవిరాజు(40)కు భార్య పావని(35), కుమార్తె కీర్తన(11), బాబు కార్తీక్ ఉన్నారు. దంపతులు ప్రైవేట్ జాబ్స్ చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. మే 1న పావని సోదరుడి పెళ్లి ఉండగా గడప కడిగేందుకు VKB జిల్లా రుక్మాపూర్‌కు <<19636029>>ఫ్యామిలీ<<>>తో కలిసి వెళ్లింది. సోమవారం ఉదయం స్కూటర్‌పై తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబలించింది. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో పెళ్లింట తీవ్ర శోకం నిండింది.


