News March 29, 2025

కూకట్‌పల్లి: డబ్బులు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తి అదృశ్యం

image

ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.

Similar News

News November 2, 2025

VJA: మరి కాసేపట్లో జడ్జి ముందు జోగి రమేశ్ హాజరు

image

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇవాళ సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరికాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టి కష్టడి కోరే అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముంది విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు.

News November 2, 2025

అనంతపురం: డివైడర్‌ను ఢీకొన్న బైకు.. యువకుడు మృతి

image

అనంతపురం నగర శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ బైక్‌పై అనంతపురం నుంచి హిందూపూర్‌కి వెళుతుండగా డివైడర్‌ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అవినాష్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 2, 2025

ఏఐ ప్రభావాన్ని పెంచేలా నియామకాలు: సత్య నాదెళ్ల

image

భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విస్తరణ స్మార్ట్‌గా ఉంటుందని సంస్థ CEO సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని, ఈ నియామకాలు AI ప్రభావాన్ని పెంచేలా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా యాంత్రికంగా ఏదీ ఉండదన్నారు. AI సాయంతో వేగంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీలో 2.28L మంది ఉద్యోగులున్నారు. పలు దశల్లో 15K మందికి లేఆఫ్స్ ఇచ్చింది.