News February 6, 2025

కూకట్‌పల్లి-నిజాంపేటలో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ

image

కూక‌ట్‌ప‌ల్లి-నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుప‌త్రి వెనుక ప్ర‌భుత్వ స్థ‌లం చుట్టూ నిర్మించిన ప్ర‌హ‌రీని బుధ‌వారం హైడ్రా తొల‌గించింది. ‘300ల గ‌జాల ఇంటి స్థ‌లం క‌బ్జాకు గురైంద‌ని ఓ మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. విచార‌ణ చేయగా దాదాపు 1253 గ‌జాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురైన‌ట్లు తేలింది. దీంతో క‌బ్జా చేసిన స్థ‌లం చుట్టూ నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది’ అని అధికారులు స్పష్టం చేశారు.

Similar News

News December 22, 2025

రెండో పెళ్లిపై మారుతున్న దృక్పథం

image

భారతీయుల్లో రెండో పెళ్లిపై అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. రీబౌన్స్ మ్యాచ్‌మేకింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో విడాకులు తీసుకున్న వారిలో 28% మంది మళ్లీ పెళ్లికి సిద్ధమని వెల్లడించారు. గతం తమ భవిష్యత్తును డిసైడ్‌ చేయకూడదని వారు భావిస్తున్నారు. ఈ మార్పులో మహిళలే ముందుండటం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ఆలోచనా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సమాజంలో మారుతున్న ఈ ఆలోచనా విధానంపై మీ Comment?

News December 22, 2025

ఏర్పేడు: ముగిసిన ఇంటర్ స్పోర్ట్స్ మీట్.!

image

తిరుపతి IIT వేదికగా జరుగుతున్న 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగిసింది. ఐఐటీ మద్రాస్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ అశ్విన్ మహాలింగం అతిథిగా హాజరయ్యారు. విజేతలు వీరే:
> చెస్ విజేత : IIT బాంబే రన్నర్ : మద్రాస్
> మహిళల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : ఢిల్లీ
> పురుషుల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : కాన్పూర్
> వెయిట్ లిఫ్టింగ్టీం ఛాంపియన్ : IIT రూర్కీ.

News December 22, 2025

తిరుపతి: ‘కరంటోళ్ల జనబాట’కు ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకారం

image

ఏపీఎస్పీడీసీఎల్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా సీఎండీ శివశంకర్ ‘కరంటోళ్ల జనబాట’ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 22వ తేదీన పాకాల మండలంలో మంత్రి రవికుమార్ దీనిని ప్రారంభించనున్నారు. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.