News September 12, 2025
కూకట్‌పల్లి: రేణు హత్య కేసులో పురోగతి

కూకట్‌పల్లిలో వ్యాపారి భార్య రేణు అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం నిందితుల కోసం ఝార్ఖండ్‌కు వెళ్లింది. కాగా, నిందితులు హర్ష, రోషన్.. రేణు హత్య అనంతరం వాడిన స్కూటీని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News September 12, 2025
నిర్మల్ : బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు తెలిపారు. ఇందులో భాగంగా 17న మండల, పట్టణ కేంద్రాల్లో రక్తదానం, 18న స్వచ్ఛభారత్, 25న ప్రవాస్ బూత్ స్థాయిలో మొక్కలు నాటడం, 27న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ, సన్మానం ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులు, పదాధికారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
News September 12, 2025
కెరీర్ గైడెన్స్ కోసం యాప్: కలెక్టర్

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేందుకు ఒక యాప్‌ను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన పలు సూచనలు తీసుకున్నారు. పదవ తరగతిలో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తును రూపొందిస్తాయని ఆయన అన్నారు. ఈ యాప్ వారికి సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
News September 12, 2025
KPHB: ఆత్మహత్యాయత్నం కేసులో గృహిణి రిమాండ్

KPHB 6వ ఫేజ్‌లో దంపతులు సూసైడ్ అటెంప్ట్ కేసు గత నెల 30న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిలో భర్త రామకృష్ణారెడ్డి చనిపోగా భార్య రమ్యకృష్ణ చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించడం, భర్తను కత్తితో గాయపరచగా రక్తస్రాపమై మృతి చెందాడు. భార్య చనిపోవడానికి ప్రయత్నించగా భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.