News January 2, 2026
కూటమి దౌర్జన్యాలను తిప్పికొడదాం: YS జగన్

AP: పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి నేతలు దాడులు చేస్తున్నారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వీటిని బలంగా తిప్పికొడదామని నేతలకు పిలుపునిచ్చారు. తప్పులు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం(D) యల్లనూరులో పార్టీ ZPTC సభ్యుడు విజయప్రతాప్‌పై హత్యాయత్నాన్ని జగన్ ఖండించారు. ఆయన తండ్రి నారాయణ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.
Similar News
News February 14, 2026
నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల వారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsi.gov.in
News February 14, 2026
25వేలకు పైగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. GD, టెక్నికల్, క్లర్క్/ స్టోర్‌కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 25వేలకుపైగా ఖాళీలున్నాయి. పోస్టును బట్టి 8th క్లాస్, టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. 17½-25 ఏళ్ల వయసుండాలి. APR 1 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 1-15 వరకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
News February 14, 2026
అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందొచ్చు!

రిస్క్ లేకుండా అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందవచ్చు. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (MODS) ద్వారా సేవింగ్స్ అకౌంట్‌లో నిర్ణీత పరిమితి దాటిన డబ్బు ఆటోమేటిక్‌గా FDగా మారుతుంది. అవసరమైనప్పుడు ఆ డబ్బును ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది. తక్కువ రిస్క్‌తో ఎక్కువ వడ్డీ వస్తుంది. చాలా బ్యాంకుల్లోనూ ఈ సౌకర్యం ఉన్నప్పటికీ లిమిట్‌లో తేడాలున్నాయి. SHARE IT


