News July 13, 2024
కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు మహర్దశ: ఎంపీ లావు

మంగళగిరి మండలం కొలనుకొండలోని శ్రీ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా సీఎం చంద్రబాబు చేపట్టిన పూజా కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు మహర్దశ రానుందని చెప్పారు.
Similar News
News February 27, 2026
GNT: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లు.. దరఖాస్తుల ఆహ్వానం

వచ్చే విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ఉచిత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. అర్హులైన వారు మార్చి 10వ తేదీలోగా cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లా కోర్టులో దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నిరుపేద విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News February 27, 2026
వీధి కుక్కల నియంత్రణపై చర్యలు చేపట్టాలి: GNT కలెక్టర్

వీధి కుక్కలపై ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణపై గురువారం సమావేశం నిర్వహించారు. వీధి కుక్కల వలన చిన్న పిల్లలు ఆడుకోవాలన్నా భయపడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా శునకాలు ప్రజలపై దాడి చేస్తున్నాయని వాటి నుంచి రక్షణ కల్పించాలని చెప్పారు.