News January 31, 2025

కూటమి ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్: కొరముట్ల

image

రాయచోటిలో వైసీపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను, 8 నెలల చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా వైసీపీ శ్రేణులు తిప్పి కొట్టాలన్నారు.

Similar News

News January 1, 2026

ఖమ్మం: నేటి నుంచి ‘ఆపరేషన్ స్మైల్-12’

image

ఖమ్మం జిల్లాలో అనాథలు, బాల కార్మికులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు నేటి నుంచి ‘ఆపరేషన్ స్మైల్’ 12వ విడత ప్రారంభం కానుంది. పోలీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈనెల 30 వరకు తనిఖీలు నిర్వహిస్తారు. పరిశ్రమలు, దుకాణాలు, ఇటుక బట్టీల్లో పని చేసే బాలలను గుర్తించి వారికి కౌన్సెలింగ్, రక్షణ కల్పిస్తామని జిల్లా అధికారి వేల్పుల విజేత తెలిపారు. బాల్యవివాహాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.

News January 1, 2026

బాల భీముడు పుట్టాడు.. అదీ నార్మల్ డెలివరీ..

image

AP: అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ ఏకంగా 4.8 కేజీల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. అది కూడా నార్మల్ డెలివరీ కావడం విశేషం. పెందుర్తికి చెందిన మహిళకు సాధారణ ప్రసవంలో శిశువు తల మామూలుగానే బయటకు వచ్చినా భుజాలు రాకపోవడంతో సిజేరియన్ తప్పదేమోనని భావించారు. కానీ వైద్యులు 4 గంటల పాటు శ్రమించి సాధారణ కాన్పు చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లను మంత్రి సత్యకుమార్ అభినందించారు.

News January 1, 2026

పాడేరులో జిల్లా స్థాయి నూతన సంవత్సరం వేడుకలు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం–2026 వేడుకలు నేడు పాడేరులో నిర్వహించనున్నారు. ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. (మనివా గ్రిల్స్ రెస్టారెంట్ ఎదురుగా) వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు హాజరుకావాలని జిల్లా యంత్రాంగం కోరింది.